Andhra Pradesh: కడప గడ్డ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా మీ కుటుంబానికి ఎంతో చేసింది!: జగన్ కు తులసిరెడ్డి కౌంటర్

  • 2009లో కాంగ్రెస్ వల్లే మీరు లోక్ సభకు వెళ్లారు
  • మీ భేటీలో దీన్ని ప్రస్తావించకపోవడం దారుణం
  • కడప జిల్లాలో మీడియాతో కాంగ్రెస్ నేత

వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. 2009లో జగన్ కు లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసేందుకు సైతం కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటిది ఇటీవల జరిగిన ఓ సభలో జగన్ కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కడప జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కడప గడ్డ మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ కుటుంబానికి ఎంతో మేలు చేసిందని స్పష్టం చేశారు. వైఎస్ కు ఆరుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండు సార్లు సీఎంగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. అలాంటిది జగన్ కడప జిల్లాలో జరిగిన పర్యటనలో కాంగ్రెస్ పార్టీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ఎంతమాత్రం సరికాదన్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Congress
ysr family
  • Loading...

More Telugu News