Andhra Pradesh: చిన్నారి చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది డ్రామా.. వేరొకరికి అమ్మేందుకు యత్నం!

  • కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఘటన
  • వాణి ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం
  • విజయవాడ ఆసుపత్రిలో ప్రత్యక్షమైన చిన్నారి

పుట్టిన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పి చిన్నారిని మరొకరికి అమ్మేందుకు యత్నించిన దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని జవ్వారుపేటలోని వాణి హాస్పిటల్‌లో కనకదుర్గ అనే మహిళ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన కొద్దిసేపటికే చిన్నారి చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాయి.

దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లను తమదైన శైలిలో విచారించడంతో చిన్నారిని ఆసుపత్రి సిబ్బందే అపహరించి విజయవాడకు తరలించినట్లు తేలింది. ప్రస్తుతం ఈ చిన్నారి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. కాగా, చిన్నారిని తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారులు విజయవాడకు బయలుదేరారు.

Andhra Pradesh
Krishna District
infant kidnap
Vijayawada
  • Loading...

More Telugu News