shankar: ఇళయరాజా గారితో అందుకే పనిచేయలేదు: దర్శకుడు శంకర్

  • ఇళయరాజా గారు అంటే నాకు గౌరవం
  • ఆయన అపాయింట్ మెంట్ తీసుకున్నాను
  •  అందుకే ధైర్యం చేయలేదు  

సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజులా ఇళయరాజా కనిపిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడానికి  చాలామంది దర్శకులు ఆసక్తిని చూపుతుంటారు. అలాంటిది దర్శకుడు శంకర్ మాత్రం ఇంతవరకూ ఇళయరాజాతో పనిచేయకపోవడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే విషయాన్ని గురించి తాజాగా శంకర్ ప్రస్తావించాడు.

ఇళయరాజా గారు అంటే నాకు భక్తి .. గౌరవం. 'జెంటిల్ మేన్' సినిమాకి ఆయనతో కలిసి పనిచేయాలనుకున్నాను .. ఆయన అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాను. అయితే ఇళయరాజాగారి వంటి సంగీత జ్ఞానితో కలిసి పనిచేయడానికి భయం వేసింది. అలా కాదు .. నాకు ఇలా కావాలి అని చెప్పే ధైర్యం ఎలా చేయగలం? అనిపించింది. ఆయనతో బాణీలు చేయించుకునే నాలెడ్జ్ నాకు లేదనిపించింది .. అందుకే వెనక్కి తిరిగి వచ్చేశా. ఆ తరువాత రెహ్మాన్ తో చేశాను .. అక్కడి నుంచి ఆయనతోనే ట్రావెల్ చేస్తూ వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.

shankar
ilayaraja
  • Loading...

More Telugu News