Chandrababu: వచ్చే నెల 10న చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’ విడుదల

  • చంద్రబాబు జీవితం, రాజకీయ ఇతివృత్తంతో సినిమా
  • దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ
  • మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా విడుదల

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర తెలిపారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని ప్రకటించారు.

మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించినట్టు రాజేంద్ర తెలిపారు. చంద్రబాబు జీవితం, రాజకీయ ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు 2016లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సినిమాకు కథ, మాటలు అందించిన పసుపులేటి వెంకటరమణే దర్శకత్వం కూడా వహించినట్టు తెలిపారు.

Chandrababu
Chandrodayam
Telugudesam
GVK Rajendra
Movie
Andhra Pradesh
  • Loading...

More Telugu News