Bihar: ప్రజల ఖాతాల్లో మోదీ డబ్బులు వేస్తున్నారని ప్రచారం.. ఖాతాలు తెరిచేందుకు ప్రజల పరుగులు!

  • ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తున్నారని ప్రచారం
  • పోస్టాఫీసు వద్ద చాంతాడంత క్యూ
  • వదంతులు నమ్మొద్దన్నా పట్టించుకోని జనం

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తోందన్న ప్రచారంతో పోస్టాఫీసుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. బీహార్‌లోని మోతీహారీ గ్రామంలో జరిగిందీ ఘటన. ఎలా వ్యాపించిందో కానీ మోదీ అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తున్నారన్న వదంతి వ్యాపించింది.

అంతే.. గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. గ్రామస్థులందరూ పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో జాతరను తలపించింది. మహిళలు, పురుషులు క్యూల్లో గంటల కొద్దీ నిలబడ్డారు. ఈ వార్తలో నిజం లేదని, అదంతా అబద్ధమని చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఆకలి దప్పులు మరచిపోయి మరీ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపారు.

Bihar
Narendra Modi
Bank Account
Post Office
Villagers
  • Loading...

More Telugu News