varalakshmi sarath kumar: 'నాగకన్య'గా వరలక్ష్మీ శరత్ కుమార్

  • పాము నేపథ్యంలో సాగే కథ
  • తమిళ టైటిల్ గా 'నీయా'
  • త్వరలో ఆడియో రిలీజ్      

తెలుగు .. తమిళ భాషల్లో గతంలో పాము నేపథ్యంలో సాగే ఎన్నో కథలు తెరకెక్కాయి. కంటెంట్ బాగా వున్న సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. చాలాకాలం తరువాత అలా పాము నేపథ్యంలో తమిళంలో ఒక సినిమా నిర్మితమవుతోంది .. ఆ సినిమా పేరే 'నీయా'.

వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి .. కేథరిన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 'జై' ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. 

varalakshmi sarath kumar
rai lakshmi
cetherine
  • Loading...

More Telugu News