Telangana: మధులికపై దాడి కేసు.. ప్రేమోన్మాది భరత్ ను కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు!

  • రిమాండుకు తరలిస్తూ కోర్టు ఉత్తర్వులు
  • నాలుగు సర్జరీలు చేసిన వైద్యులు
  • ఇంకో 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని స్పష్టీకరణ

ఇంటర్ యువతి మధులికపై కొబ్బరి బొండాం కత్తితో దాడిచేసిన నిందితుడు భరత్ ను పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం నిందితుడిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. మరోవైపు మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు కాస్త ఫలితం దక్కింది.

ఐదుగురు డాక్టర్ల బృందం7 గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆసుపత్రి సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 28 యూనిట్ల రక్తాన్ని ఎక్కించామని వెల్లడించారు, మధులిక కాస్త కోలుకుందని, సైగలు కూడా చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో 48 గంటల పాటు గడిస్తేనే కానీ ఆమె ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్పలేమని అన్నారు.

Telangana
madhulika
bharat
love affair
nampally court
yasodha hospitals
  • Loading...

More Telugu News