Telangana: పెళ్లి చేయమంటూ వేధింపులు.. అవమానం భరించలేక యువతి ఆత్మహత్య

  • జగిత్యాల జిల్లాలో ఘటన
  • ఇంటికొచ్చి పెళ్లి చేయాలని కోరిన యువకుడి బంధువులు
  • మనస్తాపంతో ఉరేసుకున్న యువతి

అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు ఆగడం లేదు. బుధవారం హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది బాలికపై కత్తితో దాడిచేసిన ఘటన మరువక ముందే అటువంటిదే మరొకటి జరిగింది. యువకుడి వేధింపులు భరించలేని యువతి బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దంపెటలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన హర్షిత (22)ను అదే గ్రామానికి చెందిన దినేశ్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల దినేశ్ కుటుంబ సభ్యులు హర్షిత ఇంటికి వెళ్లి తమ కుమారుడికి హర్షితను ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా కోరారు. వారి వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హర్షిత గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Jagityal
Love
Suicide
  • Loading...

More Telugu News