Hyderabad: ప్రేమికులకు మెట్రో లిఫ్టులు ఎంతో 'ముద్దు'!

  • లిఫ్ట్ పైకి వెళ్లే ఆ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కుర్రకారు
  • దృశ్యాలు చూసి అవాక్కైన మెట్రో సిబ్బంది
  • సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా మూసుకుని ఉండే ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారాయి. నిత్యం రద్దీగా ఉండే నగరంలో కాసింత ఏకాంతం కోరుకునే ప్రేమికులకు మెట్రో లిఫ్ట్‌లు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాయి.

ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించని ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇటీవల ఈ సీసీటీవీ ఫుటేజీలను గమనించిన సిబ్బంది అందులోని దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాటిని పోలీసులకు అందించారు. లిఫ్ట్‌లలో అధర చుంబనాలు కానిచ్చేస్తున్న వారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

Hyderabad
Metro Rail
Lovers
Metro Lifts
Students
Telangana
  • Loading...

More Telugu News