Andhra Pradesh: నన్ను అంతం చేయడానికి వైసీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి!: బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు

  • జీవీఎల్ ఓ పవర్ బ్రోకర్
  • దీనిపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేస్తా
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జీవీఎల్ నరసింహారావు ఓ పవర్ బ్రోకర్ అని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జీవీఎల్ ఫిర్యాదు చేయడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు.

తనను అంతం చేయడానికి వైసీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అంతకుముందు జీవీఎల్ స్పందిస్తూ.. కాల్ మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో బుద్ధా వెంకన్న సూత్రధారని విమర్శించారు. ఆయనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశానన్నారు. బుద్ధా వెంకన్న క్షమాపణ చెబితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తానని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
gvl
narasimharao
budha venkanna
criticise
power broker
ap dgp
  • Loading...

More Telugu News