jagan: జగన్ ఓ హంతకుడు, భక్షకుడు: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

  • మూర్ఖుడైన జగన్ కు మాట్లాడే అర్హత లేదు
  • జగన్ లా చంద్రబాబు నేరస్తుడు కాదు
  • మా దురదృష్టం కొద్దీ ప్రతిపక్ష నేతగా వచ్చాడు

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ... హంతకుడు, భక్షకుడు అయిన జగన్ కు కనిపించడం లేదని మండిపడ్డారు. జగన్ ఒక మూర్ఖుడని... ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదని అన్నారు. చంద్రబాబు నేరస్తుడు, హంతకుడు, భక్షకుడు కాదని... ఈ విషయాన్ని జగన్ తెలుసుకోవాలని చెప్పారు. చిన్న వయసులోనే తప్పులు చేసిన వ్యక్తి... తమ దురదృష్టం కొద్దీ ప్రతిపక్ష నేతగా వచ్చాడని విమర్శించారు.

jagan
Chandrababu
bandaru satyanarayana murty
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News