Tamilnadu: టీటీవీ దినకరణ్ కు సుప్రీం షాక్.. ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తుపై ఆదేశాలు ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు!

  • అన్నాడీఎంకే నుంచి దినకరణ్ బహిష్కరణ
  • సొంతంగా ఏఎంఎంకే పార్టీ స్థాపన
  • ఆర్కే నగర్ నుంచి గెలుపొందిన దినకరణ్

ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరణ్ కు చెందిన పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. దినకరణ్ పార్టీకి ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తును కేటాయించేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో తాము ఆ పని చేయలేమని తేల్చిచెప్పింది.

ఏఎంఎంకే పార్టీకీ ‘ప్రెషర్‌ కుక్కర్‌’  గుర్తు ఇవ్వాలని గత మార్చి 9న చెన్నై హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పళనిస్వామి వర్గం సుప‍్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హత కారణంగా ఖాళీ అయిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 4 వారాల్లోగా ఈసీ నోటిఫికేషన్‌ ఇవ్వగలిగితే ఏఎంఎంకే పార్టీకి ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తును కేటాయించాలని తెలిపింది. లేనిపక్షంలో ఏఎంఎంకే పార్టీకి ఎన్నికల కమిషన్‌ తన ఇష్టానుసారం ఎన్నికల గుర్తును కేటాయిస్తుందని జస్టిస్‌ ఏఎం ఖన్వికల్కర్‌, జస్టిస్‌ అజయ్‌ కస్తోగిల ధర్మాసనం తీర్పునిచ్చింది.

Tamilnadu
ttv dinakaran
pressure cokker
  • Loading...

More Telugu News