Narendra Modi: మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయం.. టీడీపీ మద్దతు

  • 10న గుంటూరులో, 16న విశాఖలో మోదీ పర్యటన
  • విభజన హామీలు అమలు చేయనందుకు నిరసన
  • ఢిల్లీకి ప్రత్యేక రైళ్లలో పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, కార్మికులు

విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ నిర్ణయించింది. పదో తేదీన గుంటూరులో, 16న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఖాళీ కుండలతో స్వాగతం పలుకుతామని, రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే ఈ నిరసన అని జేఏసీ పేర్కొంది. జేఏసీ ప్రదర్శనకు టీడీపీ మద్దతు ఇవ్వనుంది.

మరోపక్క, ఈ నెల 11న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయనున్న దీక్షకు సంఘీభావం తెలపటానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధుల్ని తీసుకు వెళ్లనున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు రైళ్లు బయలుదేరనున్నాయి. అలాగే, ఈ నెల 8న వచ్చీపోయే వాహనాల్ని శుభ్రం చేస్తూ గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలపాలని జేఏసీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News