Telangana: లోక్ సభకు విజయశాంతి.. ఖమ్మం నుంచి పోటీ?

  • ఉద్యమకారిణిగా రాములమ్మకు మంచి పేరుంది
  • ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాగతిస్తాం
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ వ్యాఖ్య

ఖమ్మం లోక్ సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసిందా? అక్కడి నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిని పోటీ చేయించేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారిణిగా, ప్రముఖ నటిగా విజయశాంతికి గుర్తింపు ఉందన్నారు. ఓ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన మానవతారాయ్ మీడియాతో మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం కోసం, విజయశాంతి గెలుపు కోసం తాను కృషిచేస్తానని తెలిపారు. ఈసారి వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తాననీ, ఈ సీటు ఇవ్వాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరుతానని మానవతారాయ్ పేర్కొన్నారు.

Telangana
Khammam District
loksabha seat
contest
vijaysanthi
Congress
manavatarai
  • Loading...

More Telugu News