Cricket: క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, రాహుల్ లపై రాజస్థాన్ లో కేసు నమోదు!

  • కాఫీ విత్ కరణ్ కార్యక్రమంతో రాజుకున్న వివాదం
  • మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో జట్టు నుంచి వేటు
  • తాజాగా కరణ్ జొహార్ సహా ముగ్గురిపై కేసు

కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొని టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు ఇంకా కష్టాలు వీడలేదు. వీరిద్దరిపై గత నెల 24న నిషేధం ఎత్తివేయడంతో  హార్దిక్ జాతీయ జట్టులోకి తిరిగిరాగా, రాహుల్ ఇండియా-ఏ జట్టు తరఫున మ్యాచ్ లు ఆడాడు. తాజాగా వీరిద్దరితో పాటు కాఫీ విత్ కరణ్ కార్యక్రమం వ్యాఖ్యాత కరణ్ జొహార్ పై కేసు నమోదయింది. ఈ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కేసు నమోదయింది. కాగా, తమ వ్యాఖ్యలపై పాండ్యా, రాహుల్ తో పాటు కరణ్ జొహార్ ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Cricket
India
hardik pandya
ka rahul
Rajasthan
Police
case
jodhpur
coffee with karan
karan johar
  • Loading...

More Telugu News