jagan: ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీలో చేరుతున్నా: కోట్ల హర్షవర్ధన్ రెడ్డి

  • కార్యకర్తలను కాపాడుకోవడానికే వైసీపీలో చేరుతున్నా
  • 100 వాహనాలతో కడపకు వెళ్తున్నాం
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నా

కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు మనుగడ ఉండదని, కార్యకర్తలను కాపాడుకోవడానికే తాను వైసీపీలో చేరుతున్నానని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి పదవులు ఆశించకుండా, కేవలం రాజశేఖరరెడ్డి మీద అభిమానంతోనే వైసీపీలో చేరబోతున్నానని చెప్పారు. రేపు ఉదయం 6 గంటలకు కోడుమూరులో కోట్ల విజయభాస్కరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తామని... అనంతరం 100 వాహనాలతో కడపకు వెళ్తామని తెలిపారు. కడప సమీపంలో ఉన్న గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంతంలో జగన్ సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీలో చేరుతామని చెప్పారు. కోడుమూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు. 

jagan
kotla harshavardhan reddy
congress
ysrcp
  • Loading...

More Telugu News