Andhra Pradesh: హైదరాబాద్ కు రానున్న మహేశ్ బాబు మైనపు విగ్రహం.. అభిమానుల కోసం ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శన!

  • సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తరలింపు
  • మహేశ్ అభిమానుల కోసం ప్రదర్శన
  • అనంతరం లండన్ కు వెళ్లనున్న విగ్రహం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజే వేరు. అందుకే ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ విగ్రహానికి చోటు దక్కింది. ప్రస్తుతం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్వరలోనే ఈ విగ్రహం హైదరాబాద్ కు రానుంది.

మహేశ్ బాబు భాగస్వామిగా ఇటీవల ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపు విగ్రహాన్ని అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నెల చివరిలో మహేశ్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి, ఆ తర్వాత లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి. విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

Andhra Pradesh
Telangana
Mahesh Babu
Tollywood
wax statue
London
singapore
Hyderabad
AMB cinemas multiplex
  • Loading...

More Telugu News