Jhansi: తెలుగు టీవీ నటి, 'పవిత్రబంధం' ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్య!

  • ఇంట్లో ఉరి వేసుకున్న ఝాన్సీ
  • ప్రేమ విఫలమే కారణం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

పలు తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె, తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓ యువకుడిని ప్రేమించి విఫలమైనందునే విరక్తి చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, 'పవిత్రబంధం' సీరియల్ తో ఝాన్సీ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఆమె మరణంపై పలువురు టీవీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

Jhansi
Sucide
Telugu
Pavitrabandham
  • Loading...

More Telugu News