jana sena: తొలి పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన ‘జనసేన’

  • నరసాపురం నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు
  • ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్
  • ఇంటలెక్చువల్ కౌన్సిల్, లీగల్ విభాగ సభ్యుల ఎంపిక

జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా తొలి కమిటీని ప్రకటించింది. నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా యిర్రింకి సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా  కనకరాజు సూరి, యర్రా నవీన్,  వైస్ చైర్మన్ గా పోలిశెట్టి వాసు, కోశాధికారిగా పిళ్ళా నారాయణమూర్తి, అధికార ప్రతినిధులుగా  చేగొండి సూర్యప్రకాశ రావు, పాదం మూర్తి నాయుడు, అనుకుల రమేష్ లను నియమించింది. ఇంటలెక్చువల్ కౌన్సిల్, లీగల్ విభాగం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

jana sena
narasapuram
parliamentary committee
  • Loading...

More Telugu News