jeevitha: జీవితలా వారానికి ఒకసారి కోర్టుకు వెళ్లేవాడిని కాదు: కౌశిక్ రెడ్డి

  • గుణశేఖర్ నన్ను దుర్భాషలాడారు
  • నా డ్రైవర్ ను కులం పేరుతో దూషించారు
  • నా ప్రతిష్టను జీవిత దెబ్బతీశారు

సినీ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుణశేఖర్ తనను దుర్భాషలాడారని... ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, గుణశేఖర్ తనను అడ్డుకున్నారని... తన డ్రైవర్ ను కులం పేరుతో కించపరిచేలా మాట్లాడారని చెప్పారు. తన ప్రతిష్టను జీవితారాజశేఖర్ దెబ్బతీశారని మండిపడ్డారు. జీవితలా వారానికోసారి కోర్టు మెట్లు ఎక్కేవాడిని తాను కాదని అన్నారు. జరిగిన విషయం చాలా చిన్నదని... తనపై వాళ్లు ఫిర్యాదు చేసేంత పెద్ద ఇష్యూ కాదని చెప్పారు.

jeevitha
rajasekhar
kousik reddy
  • Loading...

More Telugu News