Vijay Devarakonda: నాలుగేళ్లనాడు బ్యాంకు ఖాతాలో రూ. 500 కూడా లేకపోవడంతో అకౌంట్ లాక్ చేశారు!: విజయ్ దేవరకొండ

  • స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ
  • నాలుగేళ్ల నాడు బ్యాంకు ఖాతాను నిలిపేసిన ఆంధ్రా బ్యాంకు
  • నాడు కనీస మొత్తం రూ. 500 కూడా లేవన్న విజయ్

విజయ్ దేవరకొండ... 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తదితర చిత్రాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి, నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడి, సరైన సమయం వచ్చే వరకూ వేచి చూసిన వ్యక్తి. ఈ సంవత్సరం ఫోర్బ్స్ వెల్లడించిన ఇండియా 'టాప్-30 అండర్ 30' జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయమై స్పందించిన విజయ్, ఐదేళ్లనాటి ఓ ఆసక్తికరమైన సంఘటనను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

 "నాకప్పుడు 25 సంవత్సరాలు. ఆంద్రా బ్యాంక్ ఖాతాలో రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ లేదని చెబుతూ, ఖాతాను లాక్ చేశారు. అప్పట్లో దీనిపై నాన్న నాకు సలహా ఇస్తూ, 30 వచ్చే లోపు సెటిల్ కావాలని సలహా ఇచ్చారు. తాము ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే విజయాన్ని ఆస్వాదించగలవని అన్నారు. నాలుగేళ్ల తరువాత... ఫోర్బ్స్ సెలబ్రిటీ 100, 30 అండర్ 30 జాబితాలో చోటు" అంటూ వ్యాఖ్యానించాడు.



Vijay Devarakonda
Andhra Bank
Forbes
30 Under 30
  • Loading...

More Telugu News