kotla surya prakash reddy: కోట్ల ఎఫెక్ట్.. రేపు చంద్రబాబుతో భేటీ కానున్న కేఈ కుటుంబం!

  • కోట్ల రాకతో వేడెక్కిన కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయం
  • అసంతృప్తితో ఉన్న కేఈ సోదరులు
  • చంద్రబాబుకు తమ వాదనను వినిపించనున్న కేఈ బ్రదర్స్

కర్నూలు జిల్లాలో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్న నేపథ్యంలో... కర్నూలు టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబసభ్యులు భేటీ కానున్నారు. కోట్ల టీడీపీలో చేరే విషయంపై వీరు చర్చించనున్నారు. కోట్ల చేరికకు సంబంధించి చంద్రబాబుకు కేఈ సోదరులు తమ వాదనను వినిపించనున్నారు.

మరోవైపు, కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై కేఈ సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుతో కోట్ల భేటీపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ విషయం గురించి తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. తనకు సమాచారం ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుతో కేఈ కుటుంబం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

kotla surya prakash reddy
ke krishnamurthi
Telugudesam
Kurnool District
Chandrababu
  • Loading...

More Telugu News