Nara Lokesh: దావూద్, లాడెన్ కన్నా భయంకరంగా ఉన్నాడంటూ... లోకేశ్ మార్ఫింగ్ ఫోటో పెట్టిన రామ్ గోపాల్ వర్మ!

  • నారా లోకేశ్ ను టార్గెట్ చేసిన వర్మ
  • సినిమాల్లో నటించాలని సలహా
  • తారక్ కన్నా డైలాగులు బాగా చెబుతాడని సెటైర్లు

"వావ్... ఈ అద్భుత పర్సనాలిటీని చూసి నాకు భయం వేస్తోంది. ఇతను ఎవరో నాకు తెలియదు. కానీ, ఇతను దావూద్ ఇబ్రహీం, ఒసామా బిన్ లాడెన్, పరిటాల రవికన్నా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఎవరైనా ఇతను ఎవరో చెప్పగలరా?" అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరో వివాదానికి తెరలేపారు.

 ఆపై ఇంకో ట్వీట్ పెడుతూ, "అరవింద సమేత చిత్రంలో తారక్ బదులు ఇతన్ని పెట్టి ఉంటే మూడురెట్ల ఘన విజయాన్ని సాధించివుండేది" అన్నారు. అంతటితో ఊరుకోని వర్మ, "ఎవరో ఇతను రాజకీయాల్లో ఉన్నాడని చెప్పారు. కానీ నేను మాత్రం సినీ పరిశ్రమలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. అతని డైలాగ్ డెలివరీ ఫెంటాస్టిక్. అతని వాక్చాతుర్యాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చవచ్చు. సినిమా స్టార్ కాకుండా రాజకీయాల్లో ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నాడో" అని ఇంకో ట్వీట్ పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.









Nara Lokesh
Ramgopal Varma
Tarak
NTR
Twitter
  • Loading...

More Telugu News