Tamilnadu: టాయిలెట్ కోసం బస్సు ఆపలేదని దూకేసిన మహిళ!

  • తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో ఘటన
  • బస్సును ఆపాలని వేడుకున్నా వినని డ్రైవర్, కండక్టర్
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

తను చాలా అత్యవసరంగా టాయిలెట్ కు వెళ్లాలని, బస్సును వెంటనే ఆపాలని ఓ మహిళ ఎంత వేడుకున్నా డ్రైవర్ ఆపకపోవడంతో, బస్సులో నుంచి దూకిన ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో జరిగింది. ఇడయాన్ కుళం ప్రాంతానికి చెందిన పాండియమ్మాళ్ అనే మహిళ, ఆండిపట్టి నుంచి శ్రీవిల్లి పుత్తూర్ కు బయలుదేరిన బస్సులో ఎక్కింది.

మార్గమధ్యంలో ఆమె అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. బస్సును ఒక్క నిమిషం ఆపాలని ఆమె డ్రైవర్ ను, కండక్టర్ ను ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. దీంతో ఆమె బస్సు నుంచి దూకేసింది. దాంతో గాయాలపాలు కావడంతో తొలుత విల్లిపుత్తూర్ ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం మధురై రాజాజీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Tamilnadu
Bus
Toilet
  • Loading...

More Telugu News