YSRCP: ఒక దుర్మార్గుడు వచ్చి పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నాడు: జగన్ పై స్పీకర్ కోడెల ధ్వజం

  • అవినీతిలో ఉన్నోడికి అందరూ అలానే కనిపిస్తారు
  • 40 ఏళ్లుగా నిప్పులా బతుకుతున్నా
  • జగన్ రమ్మన్న చోటికి వస్తా.. చర్చకు సిద్ధమా?

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విరుచుకుపడ్డారు. ఓ దుర్మార్గుడు వచ్చి పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నాడంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన వాడికి ప్రతి ఒక్కరు అవినీతి పరుల్లానే కనిపిస్తారన్నారు. గుంటూరు జిల్లా  సత్తెనపల్లిలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

నాలుగు దశాబ్దాలుగా నిప్పులా బతుకుతున్న తనపై జగన్ అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయమని కోడెల అన్నారు. తప్పు చేయాల్సి వచ్చిన రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. తాను తప్పుచేసినట్టు నిరూపించాలని, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలన్నారు. లేదంటే, జగన్ ఎక్కడికి రావాలో చెబితే తానే అక్కడికి వెళ్తానని కోడెల సవాల్ విసిరారు.

YSRCP
YS Jagan
Kodela sivaprasad
Telugudesam
Guntur District
Andhra Pradesh
  • Loading...

More Telugu News