Andhra Pradesh: స్థానికులకు ఉద్యోగాలు రాకుండా జగన్ కుట్ర పన్నారు: నారా లోకేశ్

  • ‘కియా’ ముందు వైసీపీ నాయకుల ధర్నా తగదు
  • ఏపీ ప్రజలపై జగన్ కక్ష గట్టారు
  • 2019 తర్వాత జగన్ కి ఉద్యోగం లేకుండా ప్రజలు చేస్తారు

అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమ ముందు వైసీపీ నాయకులు ధర్నా చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ ల నీచరాజకీయానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు. ఏపీ ప్రజలపై జగన్ కక్ష గట్టారని, పంటలు తగలబెట్టి, కోర్టులో కేసులు వేసి రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడ్డారని విమర్శించారు.

హెచ్సీఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,  రిలయన్స్, టీసీఎస్ వంటి కంపెనీలు రాష్ట్రానికి రాకుండా జగన్ తన అవినీతి పత్రిక ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లు వస్తుంటే అడవులు మాయమవుతాయంటూ స్థానికులకు ఉద్యోగాలు రాకుండా జగన్ కుట్ర పన్నారని, తన ఫ్యాక్షన్ బుద్ధి చూపిస్తున్న జగన్ కి 2019 తర్వాత ప్రజలు ఉద్యోగం లేకుండా చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
 

  • Loading...

More Telugu News