nani: నాని సరసన ముగ్గురు హీరోయిన్లు ఖరారు

  • విక్రమ్ కుమార్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
  •  ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • ఈ ఏడాది చివరిలో విడుదల  

విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించే దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి మంచి పేరుంది. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం లేకుండగా ఆయన సెట్స్ పైకి వెళ్లడు. తన తదుపరి సినిమా విషయంలోను ఆయన కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తూ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ నానితో వుంది.ఈ సినిమాలో నాని మధ్య వయస్కుడిగా .. వృద్ధుడిగా కూడా కనిపించనున్నాడు. ఆయన పాత్రతో ట్రావెల్ చేస్తూ అయిదుగురు కథానాయికలు కనిపించనున్నారు. వాళ్లలో కీర్తి సురేశ్ .. ప్రియా వారియర్ .. మేఘ ఆకాశ్ లను ఖరారు చేశారు. మరో ఇద్దరు కథానాయికలను తీసుకోనున్నారు. 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్' అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు. ఈ నెల 19వ తేదీన రెగ్యులర్ షూటింగును ప్రారంభించి, ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

nani
keerthi suresh
priya
megha akash
  • Loading...

More Telugu News