jagan: వారిపై చర్యలు తీసుకోండి: కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు

  • అధికార, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారు
  • సునీల్ అరోరాకు జగన్ ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థలను టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని తెలిపారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు అందజేశారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ వెంట విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ లు ఉన్నారు.

jagan
eci
ysrcp
Telugudesam
sunil arora
  • Loading...

More Telugu News