Petrol: వరుసగా ఐదో రోజూ తగ్గిన పెట్రో ధరలు

  • లీటరు పెట్రోలుపై 15 పైసలు
  • డీజిల్‌పై రూ. 10 పైసలు తగ్గుదల
  • హైదరాబాద్‌లో రూ. 75 కంటే దిగువకు పెట్రోలు

పెట్రో ధరలు వరుసగా ఐదో రోజూ తగ్గుముఖం పట్టాయి. సోమవారం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్‌పై  పది పైసలు తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడం గమనార్హం. ఢిల్లీలో సోమవారం లీటరు పెట్రోలు ధర రూ. 70.59గా నమోదు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.65.61గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా  రూ.76.22,  రూ.68.70గా ఉన్నాయి.

ఇక, హైదరాబాద్‌లో పెట్రోలు ధరలు రూ.75 దిగువకు చేరుకుని రూ.74.89గా నమోదు కాగా, డిజిల్ ధర రూ. 71.33కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 74.69, రూ.70.73గా ఉన్నాయి.

Petrol
Diesel
Hyderabad
Amaravathi
Delhi
IOCL
  • Loading...

More Telugu News