ambati rayudu: వెల్లింగ్టన్ వన్డే.. ఒంటరిపోరాటం చేస్తున్న అంబటి రాయుడు

  • 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఆదుకున్న రాయుడు, విజయ్ శంకర్
  • 74 పరుగులతో ఆడుతున్న రాయుడు

వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా 41 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంతో తెలుగు తేజం అంబటి రాయుడు, విజయ్ శంకర్ భారత్ ను ఆదుకున్నారు. ఇద్దరూ కలసి 98 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ను ఆదిలోనే కివీస్ పేసర్లు హెన్రీ, బౌల్ట్ లు దెబ్బతీశారు. వీరి ధాటికి రోహిత్ శర్మ 2, ధావన్ 6, శుభ్ మన్ గిల్ 7, ధోనీ 1 పెవిలియన్ చేరారు. రాయుడితో కలసి స్కోరుబోర్డును ముందుకు నడిపిన విజయ్ శంకర్ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం అంబటి రాయుడు 76 (4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాధవ్ 23 క్రీజులో ఉన్నారు.

ambati rayudu
team india
odi
wellington
new zealand
  • Loading...

More Telugu News