America: అమెరికాలో జనాల్ని చంపేస్తున్న చలి.. 12 మంది మృతి

  • అమెరికాను బెంబేలెత్తిస్తున్న చలిపులి
  • మైనస్ 46 డిగ్రీలకు చేరిక
  • వృద్ధులు, నిరాశ్రయుల కోసం వార్మింగ్ కేంద్రాల ఏర్పాటు

గతంలో ఎన్నడూ లేనంతంగా అమెరికాను చలి బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రత మైనస్ 46 డిగ్రీలకు పడిపోవడంతో తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో చలికి తట్టుకోలేక 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో జలపాతాలు గడ్డకట్టాయి. డెట్రాయిట్‌లో కాలువలు పూర్తిగా గడ్డకట్టుకుపోయాయి.

మరో 24 గంటలపాటు ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోనే ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు విపరీతంగా కురుస్తుండడంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వృద్ధులు, నిరాశ్రయుల కోసం వందలాది వార్మింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  

America
Cold
weather
freeze
died
Warming centers
  • Loading...

More Telugu News