Raghuveera Reddy: ఎన్నికల్లో జనసేన ప్రభావంపై రఘువీరా ఆసక్తికర వ్యాఖ్య

  • ఎన్నికలకు భయపడే రైతుల అంశాన్ని తెచ్చారు
  • ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనాలి
  • నెలాఖరుకల్లా అభ్యర్థులను ఖరారు చేస్తాం

ఎన్నికలకు భయపడే మోదీ రైతుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో జనసేన ప్రభావంపై ఆసక్తికరంగా స్పందించారు. జనసేన ఇంకా మొలకెత్తని విత్తనమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా భరోసా యాత్రలో అందరూ పాల్గొనాలని.. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ మాత్రమే ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తామని రఘువీరా తెలిపారు.

Raghuveera Reddy
Elections
Narendra Modi
Congress
Janasena
  • Loading...

More Telugu News