Devegouda: బాత్రూంలో జారి పడిన మాజీ ప్రధాని దేవెగౌడ.. కుడికాలికి గాయం!

  • ఆసుపత్రిలో చేర్చిన దేవెగౌడ కుమారుడు
  • అతి కష్టమ్మీద నడుస్తున్నారన్న సహాయకుడు
  • ఫ్రాక్చర్ లాంటిదేమీ లేదన్న వైద్యులు

మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ(85) నేడు బెంగుళూరు, పద్మనాభనగర్‌లోని తన నివాసంలోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఆయన కుమారుడు డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేర్చారు. జారిపడటంతో దేవెగౌడ కుడికాలికి గాయమైందని.. అతికష్టం మీద ఆయన నడుస్తున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. అయితే దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని.. కుడికాలు బెణికిందని, ఫ్రాక్ఛర్ లాంటిదేమీ కాలేదని వైద్యులు తెలిపారు.                             

Devegouda
Bengalore
Ramesh
Right leg
Injure
  • Loading...

More Telugu News