kotla surya prakash reddy: కోట్ల టీడీపీలో చేరే విషయాన్ని చంద్రబాబు చూస్తున్నారు.. నాకు తెలియదు!: కేఈ కృష్ణమూర్తి

  • కోట్ల టీడీపీలో చేరే విషయం నాకు తెలియదు
  • ఏ టికెట్ కేటాయిస్తారన్నది ఇప్పుడే మాట్లాడొద్దు
  • బీసీలకు అన్యాయం జరగదు

కర్నూలు జిల్లా నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని, ఈ విషయంతో తన కేమీ సంబంధం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళికను కేఈ ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, అసలు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరతారన్న విషయం తనకు తెలియదని అన్నారు. కోట్లకు ఏ టికెట్ కేటాయిస్తారన్న విషయం ఇప్పుడే మాట్లాడటం మంచిది కాదని చెప్పారు.

బీసీల గురించి కేఈ ప్రస్తావిస్తూ, టికెట్ వచ్చినప్పుడు అడగాలే తప్ప, రాక ముందే బీసీలకు అన్యాయం జరిగిందని మాత్రం అనొద్దని అన్నారు. బీసీలకు అన్యాయం జరగదని చెబుతూ, తప్పసరిగా ఏదో మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓ బీసీగా తనకు ముఖ్యమంత్రి అన్యాయం చేయరని కేఈ చెప్పడం గమనార్హం.

kotla surya prakash reddy
Telugudesam
Chandrababu
KE
  • Loading...

More Telugu News