Andhra Pradesh: ఏపీలో పండగ వాతావరణం నెలకొంది: నందమూరి సుహాసిని

  • పింఛన్ల పెంపుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • మహిళలకు ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది
  • డ్వాక్రా గ్రూప్స్ తో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో పేదలకు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, టీడీపీ నేత నందమూరి సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ, పింఛన్ల పెంపుపై ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

2014 కు ముందు రెండు వందలుగా  ఉన్న పింఛన్ ని వెయ్యి రూపాయలు చేశారని, ఇప్పుడు దాన్ని రెండు వేలు చేయడంతో ప్రజలు ఆనంద పడుతున్నట్టు చెప్పారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ప్రశంసించారు. డ్వాక్రా గ్రూప్స్ వల్ల మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించిందని, ఈ మహిళలకు పది వేల రూపాయలతో పాటు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుండటంతో ఓ పండగ వాతావరణం నెలకొందని అన్నారు.

Andhra Pradesh
tadikonda
Telugudesam
nandamuri
suhasinis
mla
sravankumar
dwacra
  • Loading...

More Telugu News