interim budget: రైతు సాయం కింద ఒక్క ఏపీకే రూ.15 వేల కోట్లు అవసరమవుతాయి: మంత్రి నారా లోకేశ్

  • రైతు సాయం కింద  రూ.75 వేల కోట్లే కేటాయించారు
  • ఇవి ఏం సరిపోతాయి?
  • రైతు ఖాతాల వివరాల సేకరణ ఏపీ వంటి రాష్ట్రాల్లో సులువే

కేంద్రం ప్రతిపాదించిన తాత్కాలిక బడ్జెట్ లో రైతు సాయం కింద దేశం మొత్తానికి రూ.75 వేల కోట్లే కేటాయించారని, ఒక్క ఏపీకే రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు సాయం కింద కేంద్రం కేటాయించిన రూ.75 వేల కోట్లు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. రైతు ఖాతాల వివరాలను సేకరించడం ఏపీ వంటి రాష్ట్రాల్లో సులువే కానీ, సాంకేతికత అందుబాటులో లేని రాష్ట్రాల్లో కష్టమేనని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చే పింఛన్ పైనా స్పష్టత లేదని లోకేశ్ విమర్శించారు.

interim budget
bjp
Congress
Telugudesam
Nara Lokesh
  • Loading...

More Telugu News