interim budget: ఇది తాత్కాలిక బడ్జెట్ కాదు ఎన్నికల తాయిలం: చిదంబరం విమర్శలు

  • బడ్జెట్ ప్రసంగం ఎన్నికల సమాయత్తాన్ని తలపించింది
  • యువతకు ముద్ర రుణాలు ఆశించిన స్థాయిలో లేవు
  • పేదలకు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేదు

కేంద్రం ఈరోజు ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్ కాదని, ఎన్నికల తాయిలమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఎన్నికల సమాయత్తాన్ని తలపించిందని సెటైర్లు విసిరారు. గ్రామాల్లో ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తి స్థాయిలో జరగలేదని, పేదలకు పెరిగిన గ్యాస్ సిలండర్ల ధర భారంగా మారిందని, యువతకు ముద్ర రుణాలు ఆశించిన స్థాయిలో లేవని, పేదలకు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేదని అన్నారు.

interim budget
Congress
chidambaram
mudra
  • Loading...

More Telugu News