Andhra Pradesh: పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగిన టీడీపీ, వైసీపీ సభ్యులు!

  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్
  • హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు
  • ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ అటు టీడీపీ, ఇటు వైసీపీ సభ్యులు ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు, ఏపీకి న్యాయం చేయాలి.. అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యులు కనకమేడల, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి పోటీగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం కూడా పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఏపీని టీడీపీ, కేంద్రం రెండూ మోసం చేశాయని మండిపడ్డారు.

Andhra Pradesh
parliament
YSRCP
Telugudesam
agitation
Special Category Status
bifurcation
promises
  • Loading...

More Telugu News