mithali raj: మరో ఘనతను సాధించిన మిథాలీ రాజ్.. ప్రశంసలు కురిపించిన ఐసీసీ

  • 200 వన్డేలు ఆడిన మిథాలీ రాజ్
  • ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా ఘనత
  • 199లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మిథాలీ

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మరో ఘనతను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200 వన్డే మ్యాచ్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. హ్యామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఆమె ఈ ఘనతను సాధించింది. 1999 జూన్ లో ఐర్లండ్ తో జరిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో మిథాలీ అరంగేట్రం చేసింది. మిథాలీ తర్వాత 191 మ్యాచ్ లతో ఇంగ్లీష్ మహిళా క్రికెటర్ ఛార్లొట్టే ఎడ్వర్డ్స్ రెండో స్థానంలో ఉంది.

మిథాలీ సాధించిన ఘనతపై ఐసీసీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత లెజెండ్ మిథాలీ మరో ఘనతను సాధించిందని ప్రశంసించింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించింది.

mithali raj
odi
200
record
team india
  • Loading...

More Telugu News