Bonda Uma: మట్టికుండలు, నీళ్లతో మోదీ ముఖాన కొడతారు: బొండా ఉమ

  • ఏ ముఖం పెట్టుకుని మోదీ, అమిత్ షాలు ఏపీలో అడుగుపెడతారు
  • బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తొలిసారి గళం విప్పింది టీడీపీనే
  • కేంద్ర మంత్రి పదవులను సైతం వదులకున్నాం

ఏపీకి ప్రధాని మోదీ తీరని అన్యాయం చేశారని... ఏ ముఖం పెట్టుకుని ఆయన ఏపీలో అడుగుపెడతారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలో మోదీ అడుగుపెట్టాలని అన్నారు. మోదీ, అమిత్ షాలు ఏపీలో అడుగుపెడితే... మట్టికుండలు, నీళ్లతో ఏపీ ప్రజలు వారి ముఖాన కొడతారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తొలిసారి గళం విప్పింది టీడీపీనే అని అన్నారు. కేంద్ర మంత్రి పదవులను సైతం వదులుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని... బీజేపీపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. 

Bonda Uma
modi
amit shah
Telugudesam
bjp
  • Loading...

More Telugu News