Andhra Pradesh: లోటస్ పాండ్ బీజేపీకి బ్రాంచ్ ఆఫీసుగా మారిపోయింది!: మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • మోదీని జగన్ పన్నెత్తు మాట అనలేదు
  • బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపై మంత్రి గుస్సా
  • జగన్ తరఫున మాట్లాడుతున్నారా? అని నిలదీత

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఏపీ సమైక్యంగా ఉండాలని అప్పట్లో పోరాడారని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కానీ విష్ణుకుమార్ రాజు ఈరోజు జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఆయన వైసీపీ తరఫున మాట్లాడుతున్నారా? లేక బీజేపీ తరఫున మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ మోదీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.

ఏపీ సమస్యలపై జగన్ ప్రధానిని పల్లెత్తు మాట అనడం లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. లోటస్ పాండ్ బీజేపీ బ్రాంచ్ ఆఫీసుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రయోజనాలను, చట్టప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం వల్ల ఏపీ విభజన తర్వాత కోలుకోగలిగిందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
assembly
BJP
Narendra Modi
YSRCP
Jagan
lotuspond
  • Loading...

More Telugu News