Telugudesam: తెలంగాణలో బీజేపీ ఓటమికి టీడీపీనే కారణం: విష్ణుకుమార్ రాజు
- రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది
- ఈ రెండు పార్టీల వల్ల మాకున్న సీట్లు కూడా పోయాయి
- ఈ రెండు పార్టీలు మునగడమే కాకుండా.. మమ్మల్ని కూడా ముంచేశాయి
తెలంగాణలో బీజేపీ ఓటమికి తెలుగుదేశం పార్టీనే కారణమని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ అపవిత్ర పొత్తును పెట్టుకుందని చెప్పారు. ఈ రెండు పార్టీల వల్ల ఆ రాష్ట్రంలో తమకున్న సీట్లు కూడా పోయాయని తెలిపారు. తమ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా పోయిందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు మునిగిపోవడమే కాకుండా... బీజేపీని కూడా ముంచేశాయని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడనీయకుండా విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని... అందుకే విపక్ష పార్టీలు అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ కు భయపడే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని తెలిపారు.