Senegal: సెనెగల్ లో పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి!

  • ఆస్ట్రేలియాలో ఉన్నాడని భావిస్తూ వచ్చిన పోలీసులు
  • 1990 దశకంలో ముంబైని గడగడలాడించిన రవి పుజారి 
  • రవిపై పలు హత్య కేసులు

1990 దశకంలో ముంబైని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవి పుజారిని సెనెగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా నుంచి పారిపోయిన రవి, ఆస్ట్రేలియాలో తలదాచుకున్నాడని ఇప్పటివరకూ నమ్ముతూ రాగా, అతన్ని సెనెగల్ లో అరెస్ట్ చేయడం గమనార్హం.

ప్రస్తుతం నవీ ముంబై జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు రవి పుజారి ఒకప్పుడు ప్రధాన అనుచరుడు. 2001 సమయంలో వీరిద్దరూ విడిపోయారు. రవి పుజారి కింద ఎంతో మంది షార్ప్ షూటర్స్ పనిచేస్తుండేవారు. ముంబైలో యాంటీ - ఎక్స్ టార్షన్ సెల్ పోలీసులు వీరిలో ఒక్కొక్కరినీ ఏరివేస్తుండగా, బెంగళూరుకు పారిపోయిన రవి, అక్కడి నుంచి విదేశాలకు చెక్కేశాడు.

గత సంవత్సరం జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, హక్కుల కార్యకర్త షీలా రషీద్, దళిత నేత జిగ్నేష్ మెవానీ తదితరులను హత్య చేస్తానని రవి పుజారి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వివిధ పోలీసు స్టేషన్లలో రవిపై హత్య కేసులు విచారణ దశలో ఉన్నాయి.

Senegal
Ravi Pujari
Arrest
Mumbai
  • Loading...

More Telugu News