Pawan Kalyan: పవన్ తో పొత్తు విషయం నాకు తెలియదు: జేసీ దివాకర్ రెడ్డి

  • ఎవరైనా మాతో కలవొచ్చు
  • చివరి నిమిషం వరకూ ఏదైనా జరగొచ్చు
  • రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకునే విషయం తనకు తెలియదని ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఎవరైనా తమతో కలవొచ్చని, చివరి నిమిషం వరకూ ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల ఉపయోగం లేదని, ఏదో ప్రయత్నం చేయాలి కనుక చంద్రబాబు దీక్ష చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Pawan Kalyan
jana sena
jc diwakar reddy
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News