Telangana: కరీంనగర్ కాలేజీలో ఇంటర్ అమ్మాయి అనుమానాస్పద మృతి!

  • ఆత్మహత్య చేసుకుందన్న అల్ఫోర్స్ కాలేజీ
  • హత్యేనని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు
  • మృతదేహం గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలింపు

కరీంనగర్ జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీ అమ్మాయి అనుమానాస్పద రీతిలో చనిపోవడం కలకలం రేపింది. జిల్లాలోని రేకుర్తిలో అల్ఫోర్స్ కాలేజీలో రుచిత అనే అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ బాలిక ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో బాలిక ఈరోజు ఒళ్లంతా కాలి చనిపోవడాన్ని గమనించిన యాజమాన్యం.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించింది.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి. రుచితది ఆత్మహత్య కాదనీ, హత్యేననీ, ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే కాలేజీకి చెందిన పీఈటీ టీచర్ విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రుచిత మృతి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రుచిత చనిపోయినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరారు.

Telangana
Karimnagar District
inter girl
suicide
  • Loading...

More Telugu News