Kutumba Rao: టీడీపీ విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది: ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

  • బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం
  • అవాస్తవాలు చెబుతున్నారు
  • ఏపీ ప్రభుత్వంతోనే ఒప్పందం

టీడీపీ విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన  కియా మోటార్స్ కంపెనీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నేడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కొరియా పర్యటనతో ఏపీకి కియా మోటార్స్ వచ్చినట్టు బీజేపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని కుటుంబరావు విమర్శించారు. నేరుగా ఏపీ ప్రభుత్వంతోనే కియా మోటార్స్ కంపెనీ ఒప్పందం చేసుకుందని ఆయన స్పష్టం చేశారు.

Kutumba Rao
Narendra Modi
KIa motors
BJP
Telugudesam
  • Loading...

More Telugu News