Andhra Pradesh: రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు అఖిలపక్ష సమావేశాలకు పిలుపునిచ్చారు!: విజయసాయిరెడ్డి

  • ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఎందుకు పిలవలేదు
  • ప్రత్యేకహోదాపై వైసీపీ మాత్రమే పోరాడుతోంది
  • టీడీపీ తప్ప ఎవరికైనా మద్దతు ఇస్తాం

రాజకీయ దురుద్దేశంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇచ్చారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి వైసీపీ మాత్రమే పోరాడుతోందన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీకి హోదా వద్దు-ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష భేటీని నిర్వహించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ తప్ప హోదా కోసం పోరాడే ప్రతీ ఒక్కరికి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
all party meeting
  • Loading...

More Telugu News