raghuveera reddy: అఖిలపక్ష సమావేశానికి నాకు ఆహ్వానం కూడా పంపలేదు: రఘువీరా ఆగ్రహం

  • కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడినైన నాకు ఆహ్వానం పంపలేదు
  • పార్టీ కార్యదర్శిని ఆహ్వానించడం సరికాదు
  • ప్రత్యేక హోదాను ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు ఆహ్వానం కూడా పంపలేదని దుయ్యబట్టారు. తనను కాకుండా పార్టీ కార్యదర్శి జంగా గౌతమ్ ను ఆహ్వానించడం సరికాదని అన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తాను సూచించినా చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిందని... హోదాను ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. 

raghuveera reddy
Chandrababu
congress
Telugudesam
bjp
special status
all party
meeting
  • Loading...

More Telugu News