Andhra Pradesh: టీడీపీలో కోట్ల చేరికపై నేను సీఎంతో చర్చించలేదు!: మంత్రి కేఈ కృష్ణమూర్తి

  • నేడు ఏపీ ముఖ్యమంత్రితో సమావేశం
  • శ్రీశైలం బోర్డుపై చర్చించినట్లు వెల్లడి
  • కోట్ల ఫ్యామిలీ చేరిక ప్రస్తావన రాలేదన్న నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ మంత్రి, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఈరోజు భేటీ అయ్యారు. అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం ఛాంబర్ కు వెళ్లిన మంత్రి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైనే తాను చంద్రబాబుతో చర్చించానని కృష్ణమూర్తి తెలిపారు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంపై ముఖ్యమంత్రితో మాట్లాడలేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం కూడా తన వద్ద ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కోట్ల చేరికపై తాను మాట్లాడబోననీ, సీఎం చంద్రబాబు అడిగితే మాత్రం తన అభిప్రాయాన్ని చెబుతానని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబీకులు ఏయే స్థానాలను కోరుతున్నారన్న సంగతి తనకు తెలియదని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Andhra Pradesh
Telugudesam
kotla
surya prakash reddy
Minister
ke krishna murthy
Chandrababu
meeting
chamber
  • Loading...

More Telugu News