YSRCP: వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి!: నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ హెచ్చరిక

  • సర్వేల కోసం వచ్చేవారికి వివరాలు ఇవ్వొద్దు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • నెల్లూరులో మీడియాతో వైసీపీ నేత

ఏపీలో వైసీపీ మద్దతుదారులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని వైసీపీ నేత, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సర్వేల పేరుతో వచ్చేవారికి ఎలాంటి వివరాలు ఇవ్వొద్దని ప్రజలను కోరారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సర్వేల పేరుతో వివరాలు కోరుతూ వచ్చేవారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

YSRCP
Andhra Pradesh
vote
cancellation
anil kumar yadav
mla
survey
Telugudesam
Chandrababu
criticise
  • Loading...

More Telugu News